RR: మియాపూర్లోని స్టాలిన్నగర్ కాలనీలోని మజీద్-ఏ-బిలాల్లో ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్ హాజరయ్యారు. రంజాన్ పండుగ సోదరభావాన్ని పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బండారు మోహన్ ముదిరాజ్, మర్రపు గంగాధర్ రావు, బండారు వినయ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.