RR: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పొలాల్లో మందుల పిచికారికి రైతులు డ్రోన్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో శ్రమ తగ్గించడంతో పాటు, కాస్తంత చవకగా అందుబాటులో ఉండటం వారికి ఆసరాగా నిలుస్తోంది. కీసర, ఘట్కేసర్, శంషాబాద్, చేవెళ్ల, రాజేంద్రనగర్ సహా అనేక ఏరియాల్లో మందుల పిచికారికి డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు రైతన్నలు చెబుతున్నారు. ఈ క్రమంలో డ్రోన్ కొనుగోలు చేసి సేవలందించే వారికి ఉపాధి దొరుకుతుంది.