NGKL: కల్వకుర్తిలోని ప్రధాన రహదారిపై ఆదివారం ఒక కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. బస్టాండ్ నుంచి మహబూబ్ నగర్ వైపు వెళ్లే మార్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి సరిగ్గా ఎదురుగా ఉన్న రోడ్డు పక్కన కారు అదుపు తప్పి గుంతలో ఇరుక్కుపోయింది. కారు ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.