PPM: చీపురుపల్లి గ్రామపంచాయతీలో సోమవారం ఉదయం పారిశుద్ధ్య పనులను కార్మికులు చేపట్టారు. విజయనగరం,రాజాం, లావేరు రోడ్లతో పాటు సంత మార్కెట్, విజయ కాలనీలో చెత్తని ఊడ్చి ట్రాక్టర్ సహాయంతో డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. ఈ పనులను జూనియర్ సహాయకులు రామ్మోహన్ రావు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రతి ఒక్కరు డస్ట్ బిన్ వాడుకోవాలని సూచించారు.