జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ఇండోనేషియా షట్లర్ జొనాథన్ క్రిస్టీ (Shuttler Jonathan Christie) చేతిలో లక్ష్యసేన్ పరాజయం పాలయ్యాడు. మొదటి గేమ్‌లో ఇద్దరు షట్లర్లు నువ్వా నేనా..? అన్నట్లు తలపడ్డారు. అయితే ఆట ఆఖర్లో లక్ష్యసేన్ పట్టు సడలించడంతో 21-15 తేడాతో జొనాథన్ గేమ్‌ను సొంతం చేసుకున్నాడు.దాంతో లక్ష్యసేన్ రెండో గేమ్‌ను కసిగా మొదలుపెట్టాడు. గేమ్ ఆద్యంతం ఎక్కడా జొనాథన్‌ను పైచేయి సాధించనీయలేదు.
దాంతో 13-21 తేడాతో రెండో గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. కానీ మూడో గేమ్‌లో భారత షట్లర్ అదే జోరును కనబర్చలేకపోయాడు. దాంతో ఇండోనేషియా షట్లర్ జొనాథన్ 21-16 తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు.కాగా, శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ లక్ష్యసేన్ (Lakshya Sen) 21-15, 21-19 తేడాతో జపాన్ షట్లర్ కోకి వతనాబే విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. సెమీ ఫైనల్లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు.గతేడాది జరిగిన కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games) ఛాంపియన్‌గా నిలిచిన లక్ష్యసేన్ ఇటీవలే కెనడా ఓపెన్ సూపర్ 500 టోర్నీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.