KKD: పిఠాపురం 24వ వార్డులో మస్తాన్ నవాబ్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేసిన ఆయన, ముస్లిం సోదరుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పవిత్ర రంజాన్ మాసం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.