Cats Temple: అక్కడ వింత ఆచారం..పిల్లికి గుడికట్టి పూజలు!
చాలా మందికి పిల్లులంటే చాలా భయం. కొందరు పిల్లలను పెంచుకుంటున్నా ఆ కుటుంబంలో మాత్రం మరికొందరికి ఇష్టం ఉండదు. అయితే ఇక్కడొకచోట మాత్రం పిల్లులను ఆరాధ్య దైవంగా పూజిస్తున్నారు. పిల్లులకు ప్రత్యేక ఆలయం కట్టి ప్రతి ఏడాది వాటికి జాతర చేస్తారు. అలాగే వేడుకగా పండగ జరుపుకుంటారు. ఆ ఆలయం మరెక్కడో లేదు. మన ఇండియాలోనే ఉంది.
దేశంలోని చాలా ప్రాంతాల్లో అనే వింత ఆచారాలు నెలకొన్నాయి. తాజాగా ఆ వింత ఆచారాల్లో ఒకటి వెలుగుచూసింది. కర్ణాటకలోని మైసూరు ప్రాంతంలో బెకలేల అనే గ్రామంలో వింత ఆచారం కొనసాగుతోంది. అక్కడ పిల్లులను (Cats) పూజిస్తున్నారు. మంగమా దేవాలయం ఆ ప్రాంతంలో చాలా ఫేమస్. సరిగ్గా మైసూరుకు 90 కిలోమీటర్ల దూరంలో మాండ్యలోని మద్దూర్ తాలూకాలో ఈ వింత ఆలయం ఉంది. ఆ గ్రామంలోని ప్రజలు వింత ఆరాధనను చేపడుతున్నారు.
కన్నడలో పిల్లిని బేకు అని అంటారు. ఆ ప్రాంతంలో పిల్లులను పూజిస్తారు కాబట్టి ఆ గ్రామానికి బేకలలే అనే పేరొచ్చింది. ఏడాదికొకసారి తప్పకుండా ఆ ప్రాంతంలో పిల్లి జాతరను చేపడుతారు. ఒక పెద్ద పండగను కూడా నిర్వహించడం ఆనవాయితీ. ఈ ప్రాంతంలో పిల్లులను మహాలక్ష్మికి ప్రతిరూపంగా పూజలు చేస్తారు. ఈ ఆలయం 1000 ఏళ్ల క్రితమే ప్రారంభం అయిందని ఆలయ ధర్మకర్త బసవరాధ్యుడు తెలిపారు.
పిల్లుల(Cats) ను పూజించే మంకమ్మ దేవాలయంలో ఒకదానికొకటి నిర్మించిన మూడు దేవాలయాలను అనుసంధానంగా ఉంచారు. దీంతో ఈ గ్రామ దేవాలయాల్లో ముగ్గురు కుటుంబ సభ్యులు మూడు ఆలయాలను ఏర్పాటు చేశారు. అన్ని ఆలయాల్లో పిల్లి విగ్రహం ఉంటుంది. మంగళవారం ఆ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపడుతారు. నాలుగురోజుల పాటు పిల్లులకు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ వేడుకలు చూసేందుకు బెంగళూరు నుంచి సందర్శకులు కూడా తరలివస్తుంటారు.
దాదాపుగా 800 కుటుంబాలు ఈ గ్రామంలో ఉన్నాయి. చాలా ఇళ్లల్లో రెండు మూడు పిల్లలు(Cats) ఉంటాయి. వాటికి కూడా ఆయా ఇళ్లల్లో పూజలు చేస్తారు. గ్రామంలో ఎవ్వరూ పిల్లలకు హాని అనేది తలపెట్టరు. ఒక వేళ వాటికి అశుభం కలుగుతుందని గ్రామస్తులకు తెలిస్తే ఆ ఊరికి కొత్తగా వచ్చిన వారిని తరిమికొడతారు. ఇంకా గ్రామంలో ఎవరికైనా పిల్లి కళేబరం కనిపిస్తే దానిని దహనం చేయకుండా ఉండకూడదు. ప్రస్తుతం ఈ వింత ఆచారం గురించి తెలిసిన వారు నోరెళ్లబెడుతున్నారు.