MBNR: మిడ్జిల్ మండలం బోయినపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని ఈరోజు మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. గతంలో కరెంటు పోల్ కావాలాన్నా యేండ్లకు యేండ్లు పట్టేదని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయి గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా తక్షణమే స్పందించే ప్రభుత్వం వచ్చిందన్నారు.