కడప: జిల్లా బద్వేల్ లోని మైదుకూరు రోడ్డు పరిసర ప్రాంతాలలో ఆదివారం రెవెన్యూ అధికారులు పలు హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా, నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్ గ్యాస్‌ను వినియోగిస్తున్న 7 గ్యాస్ సిలిండర్లను సీఎస్ డీటీ శివశంకర్, ఎఫ్ఐ గీత ప్రసాద్ రెడ్డి స్వాధీనం చేసుకున్నారు. బద్వేల్ ఆర్డిఓ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.