Anand Mahindra: రోడ్‌పై వినసొంపైన మ్యూజిక్.. సూపర్ అంటోన్న ఆనంద్ మహీంద్రా
ఆనంద్ మహీంద్రా మరో వీడియోను షేర్ చేశారు. హంగెరీ రోడ్లపై మ్యూజిక్ వినిపిస్తోన్న వీడియోను పంచుకున్నారు. మన దేశంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
Anand Mahindra: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) కొత్త సమాచారం షేర్ చేస్తుంటారు. దానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. తాజాగా మరో వీడియోను పోస్ట్ చేశారు. హంగెరీ రోడ్డులో వినసొంపైన వినిపిస్తోంది. వేగానికి అనుగుణంగా సాంగ్ ప్లే అవుతోంది. వేగానికి తగినట్టు పాట వస్తోంది. ఆ వీడియో ఆనంద్ మహీంద్రాకు (Anand Mahindra) నచ్చింది. మన దేశంలో కూడా అలాంటి రోడ్లు ఉంటే బాగుంది అనిపించింది. వెంటనే వీడియోను షేర్ చేశారు.. అంతేకాదు ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు.
‘హంగెరీ రోడ్లలో ఉన్న ఆలోచన అద్భుతం.. రోడ్డుపై ఓ వాహనం తగిన వేగంతో వెళ్తుంటే పాట వస్తోంది. ఏ పాట, సంగీతం వినిపించాలనేది కాస్త కష్టం. ఆయా రాష్ట్రాలను బట్టి మారుతూ ఉండొచ్చు. మన దేశంలో ఇలాంటి రహదారులు ఏర్పాటు చేయాలి. గడ్కరీ చర్యలు తీసుకుంటారని భావిస్తోన్నా’ అని ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) రాసుకొచ్చారు.
What an idea. I’m sure @nitin_gadkari ji can make our highways ‘sing’ as well. Now the only tough choice will be WHICH song or music should play when at the right speed… I would imagine it would have to change from state to state! https://t.co/lgDyKRo375
ఆ వీడియోకు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పాటల కంటే మెరుగైన రోడ్లు వేయాలని.. పాదాచారుల కోసం సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. మరొకరు అయితే ఇండియాలో ఆ రోడ్లు వర్కవుట్ కాదని నిర్మొహమాటంగా చెప్పారు. యాక్సిడెంట్లు కాకుండా ఉండేందుకు చక్కగా పనిచేస్తాయని మరొకరు రాశారు. దేశంలో ఇంప్లిమెంట్ చేయొద్దు.. ఎందుకంటే ట్రాఫిక్ మొత్తం ఆగుతుందని మరొకరు రాశారు. ఇలా ఒక్కొక్కరు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.