సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మంజూరైన 4,923 వ్యక్తిగత మరుగుదొడ్లలో 3,725 పనులు పూర్తయ్యాయని, మిగిలినవాటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు రూ.299.37 లక్షలతో ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.