NTR: అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నార్త్ ఏసీపీ సత్యానందం హెచ్చరించారు. సత్యనారాయపురం పోలీస్ స్టేషన్లో ఆదివారం ఆయన రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రతి రౌడీ షీటర్ ప్రస్తుత జీవన శైలి గురించి అడిగి తెలుసుకున్నారు. సత్ప్రవర్తనతో మెలగాలని, అసాంఘిక కార్యకలాపాల జోలికి వెళ్లరాదని హితవు పలికారు.