»Fisherman They Went Fishing Flood Time At Srikakulam One Person Died
Fisherman: వరద వస్తుందని కక్కుర్తిగా చేపల కోసం వెళ్లారు..మళ్లీ రాలేదు
గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి వరద ప్రవాహనికి చేపలు ఎక్కువగా వస్తాయని ఆశపడి ఐదుగురుకు చేపల వేటకు వెళ్లారు. కానీ వారిలో ఓ వ్యక్తి తిరిగి రాలేదు. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా(srikakulam district)లో చోటుచేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు జోరు వాన(rain) కురిసి ఎక్కడికక్కడ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో వరదకు చేపలు భారీగా వస్తాయని ఆశపడ్డ ఐదుగురు మత్య్సకారులు ఈరోజు తెల్లవారుజామున చేపల వేట కోసం వెళ్లారు. సముద్రంలో చేపలు పడదామని సాహసం చేసి పడవలో బయలుదేరారు. ఆ క్రమంలో వారు ఎక్కిన పడవ అలల ధాటికి ఆకస్మాత్తుగా మునిగిపోయింది. దీంతో అందులో ఉన్న ముగ్గురు ఎలాగోలా ఈతకొడుకు బయటకు చేరుకున్నారు. కానీ ఇద్దరు గల్లంతయ్యారు. వారిలో గంట జనార్ధన్(40) మృతి చెందగా, మరో వ్యక్తి మాత్రం కనిపించకుండా పోయి..తర్వాత ఓ పడవను పట్టుకుని ఓడ్డుకు చేరాడని తెలుస్తోంది. ఈ విషాద ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా(srikakulam district)లో జరిగింది. విషయం తెలిసిన అతని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.