AP: డ్రగ్స్ కేసులో పుట్టా మహేష్ దొరికిపోయారని మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ‘డ్రగ్స్ కేసులో ఎంపీ దొరకడం దేశచరిత్రలో ఇదే తొలిసారి. పోలీసులపై కాల్పులకు యత్నించడం సరైంది కాదు. పుట్టా మహేష్ ఎంపీ సభ్యత్వం రద్దు చేయాలి. ఎంపీపై ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి. ఏపీ టీడీపీ నేతలంతా HYDకి వెళ్లి.. డ్రగ్స్ తీసుకుంటున్నారని తేటతెల్లమైంది’ అని పేర్కొన్నారు.