యూపీ (UP) లఖ్నవూలో జ్యూలరీ షాపు యాజమాని వినుత్నంగా ఆలోచించారు. వరుడు, వధువుల కోసం చెప్పులను వెండితో తయారు చేశారు.పెళ్లి(wedding)లో వారు ధరించే నగలే కాకుండా పాదరక్షలు తలతలలాడేలా చేస్తున్నారు. 100 నుంచి 500 గ్రాములు ఉండే ఈ పాదరక్షలను 25 వేలకు విక్రయిస్తున్నారు. వినియోగదారులు (Customers) సైతం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వాటిని కొనుగోలు చేస్తున్నారు.డబ్బులున్న మహానుభావులు..వెండి చెప్పులు(Silver Sandals) చేయించుకుంటున్నారు. పెళ్లంటే ఆమాత్రం ఉండాలి కదా అనుకుంటున్నారేమో వధు వరుల కోసం వెండితో చెప్పులు చేయించుకున్నారు. వెండి మాత్రమే ఉంటే చెప్పులు ఏం బాగుంటాయి..అందుకే వాటికి ముత్యాలు(Pearls),రత్నాలతో డిజైన్ చేయించున్నారు.
వధూవరుల వెడ్డింగ్ చెప్పులు అంటూ రకరకాల మోడల్స్ లో వెండి చెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.300 నుంచి 500ల గ్రాముల వెండితో చెప్పులు తయారు చేస్తున్నారు సాధారణంగా సెలబ్రిటీలు (Celebrities) ఇంతకంటే ఖరీదైనవే వినియోగిస్తుంటారు. లక్షల రూపాయల విలువ చేస్తుంటాయి వారు ధరించే చెప్పులు, బూట్లు వంటివి.కానీ వెండితో చేసిన పాదరక్షలు అంటే కాస్త డిఫరెంట్ అనే చెప్పాలి. వధువుకు, వరుడికి వేరు వేరు డిజైన్లతో చెప్పులు చేస్తున్నారు.కొంతమంది తమ షాపుకు వచ్చినప్పుడు వెండి చెప్పుల గురించి అడగుతుంటారని. అందుకే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ (Wedding season)నడుస్తోంది అందుకు వరుడు, వధువుల కోసం చెప్పులు తయారు చేస్తున్నామని ఆర్డర్ ను బట్టి ఇది వారి వారి సైజులకు తగినట్లుగా తయారు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. నగల షాపు యజమాని వినోద్ మహేశ్వరి. వధువు, వరులకే కాకుండా చిన్నపిల్లలకు కూడా వెండి చెప్పులు తయారు చేస్తున్నామని తెలిపారు.