»Heavy Rains In Ap For Another 5 Days Meteorological Department Warning
Rain Alert: ఏపీలో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు..వాతావరణ శాఖ హెచ్చరిక
ఏపీలో మరో 5 రోజుల పాటు వర్షాలుంటాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
Rains for the telangana next 3 days august 18 to 20th 2023
ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ(weather Department) హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, అది అల్పపీడనంగా మారుతుందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం వల్ల సోమ, మంగళవారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) పడతాయని తెలిపింది.
ఏపీలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు కోస్తా ఆంధ్రా (kosta Andhra)లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటన(Weather Department) చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఈదురగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి చిరు జల్లులు పడే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
రాయలసీమ(Rayalaseema)లో మోస్తారు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) పడతాయని, సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏలూరు, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, తిరుపతి, చిత్తూరు జిల్లాలలో ఓ మోస్తారు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా మరో మూడు రోజులపాటు వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ (Hyderabad Weather Department) తెలిపింది.