Kodi Ramakrishna: శతాధిక చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) జయంతి వేడుకలు హైదరాబాద్‌లో గల ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగాయి. వాసవి ఫిల్మ్ అవార్డ్స్ నేతృత్వంలో వేడుకలు జరిగాయి. సినీ రంగం, ఉభయ రాష్ట్రాల్లో సేవలు చేస్తున్న వారికి పురస్కారాలను అందజేశారు. తెలుగు సినీ రంగంలో సుస్థిర స్థానం సంపాదించుకున్న కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) పేరుతో ఉభయ రాష్ట్రాల్లో నిలిచేలా చేయడం పురస్కారాల ఉద్దేశం అని ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. ప్రముఖ నటుడు సుమన్‌కు “నట కేసరి” బిరుదు ప్రదానం చేశారు.
కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) కుమార్తె కోడి దివ్య, తెలంగాణ ఎఫ్.డి.సి.చైర్మన్ అనిల్ కూర్మాచలం, ప్రముఖ నటులు మురళి మోహన్, బాబు మోహన్, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, సీనియర్ నటిమణులు రోజారమణి, కవిత, పెళ్ళిపుస్తకం దివ్యవాణి, వంశీ రామరాజు, ప్రముఖ వ్యాపారవేత్త బండారు సుబ్బారావు, మద్దుల ప్రకాష్, విజయలక్ష్మి, నంద కుమార్, రాయవరపు భాను ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
“విరూపాక్ష” దర్శకుడు కార్తీక్ వర్మ దండు, “సామజవరగమన” దర్శకుడు రామ్ అబ్బరాజు, కథా రచయిత భాను, “అనుకోని ప్రయాణం” దర్శకుడు వెంకట్ పెదిరెడ్ల, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు తదితరులు పురస్కారాలు అందుకున్నారు. అతిథులు, పురస్కార గ్రహీతలు కోడి రామకృష్ణ గొప్పతనాన్ని కొనియాడారు. కార్యక్రమ నిర్వాహాకులు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, విబిజి రాజు, కొత్త వెంకటేశ్వరరావుకు అభినందనలు తెలిపారు.