Indian Student: పై చదువుల కోసం.. మంచి ఉద్యోగం కోసం.. ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి వెళుతున్న కొందరు అర్ధాంతరంగా తనువు చాలించాల్సిన పరిస్థితి. అమెరికాలో జాత్యాంహకార దాడులు ఎక్కువగా జరుగుతుంటాయి. కెనడాలో కూడా ఆడపా దడపా అలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ భారతీయ విద్యార్థిపై కొందరు దుండగులు దాడి చేసి, గాయపరిచారు. తీవ్ర గాయాలతో ఆ విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
కెనడాలో గల ఒంటారియా ప్రావిన్స్‌లో గుర్విందర్ నాథ్ (24) (gurivinder nath) ఉంటున్నాడు. పై చదువు చదువుకుంటూ.. పిజ్జా డెలివరీబాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9వ తేదీన మిస్సిసాగా ఏరియాలో పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లాడు. అక్కడ అతనిని కొందరు దాడి చేసి.. అతని బైక్ దొంగిలించినట్టు తెలిసింది. తల, ఇతర చోట్ల గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు. అయినప్పటికీ నో యూజ్.. ఈ నెల 14వ తేదీన అతను చనిపోయాడు.
గుర్విందర్ (gurivinder nath) మృతి బాధాకరం అంటూ.. అతని కుటుంబ సభ్యులకు టోరంటోలో గల భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అతని కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని కాన్సులేట్ జనరల్ సిద్దార్థ్ నాథ్ తెలిపారు. గుర్విందర్ (gurivinder) దాడి ఘటనపై కేసు నమోదు చేశామని స్థానిక పోలీసులు తెలిపారు. అతని టూ వీలర్ దొంగిలించాలనే ప్లాన్‌తో పిజ్జా ఆర్డర్ చేశారని విచారణలో తేలింది.
గుర్‌విందర్‌పై (gurivinder) దాడి చేసిన తర్వాత.. నిందితుల్లో ఒకరు అక్కడినుంచి పారిపోయాడు. దాడి జరిగిన ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో నిందితుడు వాహనం వదిలేసి వెళ్లాడు. వాహనాన్ని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించామని.. నిందితులను త్వరలో పట్టుకుంటామని చెబుతున్నారు. ఈ నెల 27వ తేదీన గుర్విందర్ మృతదేహాం భారత్ తరలిరానుంది. లాస్ట్ సెమిస్టర్ పరీక్షల కోసం గుర్ విందర్ (gurivinder) కెనడాలో ఉన్నాడు. చదువు పూర్తి అయిన వెంటనే పిజ్జా ఔట్ లెట్ ఓపెన్ చేయాలని అనుకున్నాడట. ఇంతలోనే ఇలా జరగడం బాధాకరం అని అతని స్నేహితులు తెలిపారు. గుర్‌విందర్‌పై దాడిని ఖండిస్తూ 200 మంది భారతీయ విద్యార్థులు మిస్సిసాగాలో క్యాండిల్ లైట్ మార్చ్ నిర్వహించారు.