WGL: నర్సంపేటలో రోజు రోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జీజీహెచ్ ఆసుపత్రి సూపరిండెంట్ కిషన్ సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని తెలిపారు. ఎక్కువగా నీళ్లు తాగడం, మధ్యాహ్న సమయంలో బయట తిరగకుండా జాగ్రత్త పడాలని ఆయన ప్రజలకు సూచించారు. నీరసంగా అనిపిస్తే వైద్యులను సంప్రదించాలన్నారు.