CTR: పుంగనూరు పట్టణ త్యాగరాజు వీధిలో బైకు నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరి ఆడక నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కవలలు చరిత, చందన మృతి చెందారు. వీరితోపాటు అన్న కార్తీక్ కూడా మరణించాడు. ఒకేసారి పుట్టి, ఒకేసారి మృతి చెందడంతో పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి.