Baby Movie: ‘బేబీ’తో 50 కోట్లు రాబట్టారు.. కానీ పారితోషికమే దారుణం?
ఓ మీడియం రేంజ్ సినిమాతో 50 కోట్లు కొల్లగొట్టడం అంటే మాటలు కాదు. కానీ వీళ్లు మాత్రం యూత్‌ను షేక్ చేశారు. ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన బేబీ సినిమా దుమ్ముదులిపేసింది. ఫస్ట్ వీక్‌లోనే హాఫ్ సెంచరీ కొట్టేసింది. కానీ ఆ సినిమాలో నటించిన వారి రెమ్యూనరేషన్ మాత్రం చాలా తక్కువనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఈ జనరేషన్ యూత్ పల్స్‌కి తగ్గట్టుగా వచ్చిన బేబీ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ ఒక్క సినిమాతో ఐదుగురికి సాలిడ్ బ్రేక్ వచ్చింది. అప్పటి వరకు హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి పేరడీ సినిమాలు తీసిన డైరెక్టర్ సాయి రాజేష్.. బేబీతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక రౌడీ బ్రదర్ ఆనంద్ దేవరకొండకు ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. అలాగే యూట్యూబర్ వైష్ణవి చైతన్యకు హీరోయిన్గా బేబీ బ్రాండ్ నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. వీళ్లతో పాటు మరో కీలక పాత్రలో నటించిన విరాజ్ అశ్విన్‌కు కూడా ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది.
ఇక నిర్మాత ఎస్కెఎన్(SKN) చాలేంజ్ చేసి మరి బేబీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. జూలై 14న రిలీజ్ అయిన ఈ సినిమా.. మిడ్ రేంజ్ ఫిలిమ్స్‌లో వేగంగా 50 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. మొత్తంగా ఫస్ట్ వీక్‌లోనే బేబీ హాప్ సెంచరీ కొట్టేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా స్టార్ క్యాస్టింగ్ రెమ్యూనరేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్‌ల రెమ్యునరేషన్ చాలా తక్కువ అని తెలుస్తోంది.
ముగ్గురి రెమ్యునరేషన్ కలిపి కోటిన్నర కూడా లేదని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆనంద్(Anand Devarakonda)కు 80 లక్షలు, వైష్ణవి 30 లక్షలు, అశ్విన్ 20 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారని ఇన్సైడ్ టాక్. కానీ డైరెక్టర్ సాయి రాజేష్ మాత్రం కోటికి పైగా తీసుకున్నాడని అంటున్నారు. ఇందులో నిజం ఎంత? అనేది పక్కన పడితే.. బేబీతో మాత్రం వీళ్లకు భారీగా డిమాండ్ పెరిగిపోయిందనే చెప్పాలి.