సూపర్ స్టార్ మహేష్ బాబు అరుదైన వ్యాధి బారిన పడ్డారా? అంటే, నిజమేనని చెప్పొచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు కానీ.. తనే ఓ సందర్భంలో ఆ వ్యాధి గురించి చెప్పాడు. ప్రస్తుతం కూడా మహేష్ అందుకే ఫారిన్ ట్రిప్ వేశాడని తెలుస్తోంది. మరి మహేష్‌కు వచ్చిన వ్యాది ఏంటి?
ఊ అంటే, ఆ అంటే వెకేషన్స్‌కు వెళ్తుంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. సినిమాల షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి మరీ ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్‌కు వెళ్తుంటాడు. ప్రస్తుతం గుంటూరు కారం(Guntur Karam) సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు మహేష్. అయినా కూడా షూటింగ్‌ను ఆపేసి మధ్య మధ్యలో విదేశాలకు చెక్కేస్తున్నాడు. అసలు మహేష్ వెకేషన్ లెక్క ప్రకారం చూస్తే.. సంవత్సరంలో నాలుగో వంతు ఫారిన్లోనే ఉంటాడని చెప్పొచ్చు.
గతంలో మహేష్ బాబు(Mahesh Babu) స్పెయిన్, దుబాయ్ వంటి దేశాలలో కొన్ని సహజ చికిత్సల కోసమే వెళ్లినట్టు వార్తలొచ్చాయి. ఎప్పటికీ యవ్వనంగా కనిపించేందుకు కొన్ని ప్రత్యేక చికిత్స చేయించుకున్నాడని అన్నారు. అయితే ఒకానొక దశలో మహేష్ విపరీతమైన మైగ్రేన్‌తో బాధపడ్డారట. తలనొప్పి సమస్య ఏళ్ల తరబడి వేధించిందట. పెయిన్ వచ్చినప్పుడల్లా మహేష్ టాబ్లెట్స్ వేసుకునే వాడట. అప్పటికి అది ఉపశమనమే అయినా పూర్తిగా సమస్యను దూరం చేయడం లేదట. దాంతో మహేష్ భార్య నమ్రత (Namrata) ఒక లేడీ డాక్టర్ని పరిచయం చేశారట.
ఆమె మహేష్(Mahesh babu)కి అల్లోపతి ట్రీట్మెంట్ చేసి.. మైగ్రేన్ నుంచి రిలీఫ్ ఇచ్చారట. కేవలం రెండు మూడు నెలల్లో తలనొప్పి సమస్య పోయిందట. ఈ విషయాన్ని మహేష్ ఒక సందర్భంలో స్వయంగా చెప్పడం విశేషం. అయితే మైగ్రేన్ కాదు.. మహేష్‌కి మరికొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయనే పుకార్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆయనకు మోకాలి సర్జరీ జరిగిందట. తాజాగా మహేష్ బాబు అందుకోసమే విదేశాలకు వెళ్లినట్టు సమాచారం. ఓ వారం రోజుల్లో మహేష్ తిరిగిరానున్నాడట. అప్పటి వరకు త్రివిక్రమ్ మిగతా స్టార్ క్యాస్టింగ్‌తో మహేష్ లేని సీన్స్ షూట్ చేయనున్నాడని తెలుస్తోంది.