Guntur Karam: షాకింగ్.. ‘గుంటూరు కారం’ ఇంకో వికెట్ డౌన్?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ ముహూర్తాన 'గుంటూరు కారం' సినిమా మొదలు పెట్టారో గానీ.. రోజుకో రూమర్, మార్పులు చేర్పులు జరుగుతునే ఉన్నాయి. తాజాగా గుంటూరు కారం సినిమా నుంచి మరో మెయిన్ వికెట్ ఎగిరిపోయిందనే న్యూస్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ ఎవరా వికెట్?
మహేష్ బాబు(Mahesh Babu) సినిమాపై ఇన్ని పుకార్లు రావడం బహుశా ఇదే మొదటి సారేమో. అసలెందుకు గుంటూరు కారం(Guntur Karam) సినిమా పైనే ఇన్ని రూమర్స్ వస్తున్నాయో అర్థం కాని విషయమే. పోనీ అవి నిజంగానే రూమర్సా? అంటే కచ్చితంగా కాదనలేం. పుకార్లను కొంత వరకు నిజం చేస్తూనే ఉన్నారు మేకర్స్. గతంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమా నుంచి ఔట్ అయ్యారనే ప్రచారం జరిగింది. ఇందులో తమన్ న్యూస్ ఫేకే అయినా పూజా హెగ్డే మాత్రం సినిమా నుంచి మధ్యలోనే డ్రాప్ అయింది.
ఆమె ప్లేస్‌లో మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. ఇక సమ్మర్ గ్యాప్ తర్వాత ఇటీవలె దాదాపు రెండు వారాల పాటు షూటింగ్ జరుపుకుంది గుంటూరు కారం. కానీ ఈ షెడ్యూల్ తర్వాత మళ్లీ ఫారిన్ వెకేషన్‌కు వెళ్లిపోయాడు మహేష్ బాబు. ఈసారి లండన్ టూర్ వేశాడు మహేష్. అయితే.. మహేష్ అలా ఫ్లైట్ ఎక్కాడో లేదో.. గుంటూరు కారంపై వెంటనే మరో కొత్త రూమర్ స్టార్ట్ అయిపోయింది. సినిమాటోగ్రాఫర్ పిఎస్. వినోద్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది.
కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఆయన తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో త్రివిక్రమ్(Trivikram) తెరకెక్కించిన అలా వైకుంఠపురములో, అరవింద సమేత సినిమాలకు ఈయనే సినిమాటోగ్రాఫర్. అయినా కూడా గుంటూరు కారం నుంచి తప్పుకున్నట్టు టాక్. అంతేకాదు.. ఆయన ప్లేస్‌లో రవి కె.చంద్రన్‌ని తీసుకున్నట్టు టాక్ నడుస్తోంది. గతంలో త్రివిక్రమ్ మాటలు, డైలాగ్స్ అందించిన పవర్ స్టార్ భీమ్లా నాయక్ సినిమాకు ఈయన సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. దాంతో గుంటూరు కారం సినిమాకు తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల మాట. మరి ఈ సరికొత్త పుకార్లలో ఎంత వరకు నిజముందో చూడాలి.