»Teja Sajja Are You Competing With A Superstar Sir Hanumans Hero Tweet Goes Viral
Teja Sajja: సూపర్ స్టార్‌తో పోటీ ఏంటీ సర్? హనుమాన్ హీరో ట్వీట్ వైరల్
సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ.. మహేష్ బాబుతో తేజ సజ్జా లాంటి యంగ్ హీరో పోటీ పడుతుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే విషయం పై తేజ సజ్జా చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Teja Sajja: కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్న సినిమాలు చేస్తూ.. ఇప్పుడు ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరోని ఇంట్రడ్యూస్ చేస్తూ హనుమాన్ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ‘హనుమాన్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్‌కు రెడీ అవుతోంది. చిన్న సినిమాగా మొదలైన హనుమాన్.. ఇప్పుడు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్లో రిలీజ్ అవుతుంది. అయితే.. అదే రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘గుంటూరు కారం’ భారీ ఎత్తున విడుదల కానుంది.
దీంతో పాటు సంక్రాంతి రేసులో రవితేజ ‘ఈగల్’, నాగార్జున ‘నా సామిరంగ’, వెంకటేష్ ‘సైంధవ్’ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలు జనవరి 13, 14 తేదీల్లో రిలీజ్ అవుతున్నాయి. కానీ జనవరి 12న హనుమాన్, గుంటూరు కారం పోటీ పడబోతున్నాయి. మహేష్‌తో ఫస్ట్ డే పోటీ అంటే రిస్క్ తప్పదు. అయినా కూడా తగ్గేదేలే అంటున్నారు హనుమాన్ మేకర్స్. ఎందుకంటే.. జనవరి 12 రిలీజ్ డేట్లో ఇప్పటికే హనుమాన్ సినిమా ఇతర భాషల బిజినెస్ జరిగిపోయాయి. అందుకే.. హనుమాన్కు గుంటూరు కారంతో పోటీ పడక తప్పట్లేదు. ఈ విషయంలో తేజ సజ్జా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2000వ సంవత్సరంలో వచ్చిన మహేష్ బాబు ‘యువరాజు’ సినిమాలో తేజ సజ్జా మహేష్ కొడుకు పాత్రలో కనిపించాడు. ఇప్పుడు 24 సంవత్సరాల తర్వాత అదే మహేష్ బాబుతో క్లాష్‌కి దిగుతున్నాడు.. అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దీంతో.. ‘ సూపర్ స్టార్‌తో పోటీ ఏంటి సర్.. ఆయనతో పోటీగా కాదు సర్.. ఆయనతో పాటుగా’ అంటూ తేజ సజ్జా రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక పాన్ వరల్డ్ రేంజ్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు.. మాస్ మహారాజా రవితేజ వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. మరి మహేష్ బాబుని హనుమాన్ ఎలా తట్టుకుంటాడో చూడాలి.