Crime: భార్యభర్తల నడుమ గొడవలు(Quarrels between husband and wife) అనేవి చాలా సాధారణమైన విషయం కానీ… నేడు పరిస్థితులు చేదాటి పోతున్నాయి. భర్తలపై భార్యలు ఇష్టానుసారంగా కొట్టే ఘటనలు ఎక్కువైతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం జరిగింది. మొదటి భార్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాడని ఏకంగా భర్త మర్మాంగాలనే కోసేసిన ఘటన స్థానికంగా కలవరం రేపింది. ముప్పాళ్ళ గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబు గతంలో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. కానీ పెళ్లైన కొన్నిరోజులకు వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అయితే ఆనంద్ బాబు గత ఏడేళ్ల క్రితం వరమ్మ అమే మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ముప్పాళ్లలో నివాసం ఉంటున్న ఆనంద్ 5 నెలల క్రితమే నందిగామకి మకాం మార్చాడు.
శుక్రవారం రాత్రి ఆనంద్ బాబు తన మొదటి భార్య ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూస్తూ తన రెండో భార్య వరమ్మకు దొరికిపోయాడు. ఆగ్రహించిన వరమ్మ తనను రెండో పెళ్లి చేసుకోని ఇంకా మొదటి భార్య వీడియోలు ఎందుకు చూస్తున్నావని అతడితో గొడవ పడింది. ఇరువురి మధ్య గొడవ ముదిరింది ఒకరినొకరు కొట్టుకున్నారు. అంతటితో ఆగని వరమ్మ భర్త ఆనంద్ బాబుపై బ్లేడ్‌తో మర్మాంగలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అతడికి తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు.
మొదటి భార్య వీడియోలు చూస్తున్నాడని భర్త మర్మాంగం కోసిన భార్య
నందిగామ – తనని పెళ్లి చేసుకొని మళ్ళీ మొదటి భార్య వీడియోలు ఎందుకు చూస్తున్నావు అంటూ భర్త మీద బ్లేడుతో దాడి చేసి మర్మాంగాన్ని కోసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగింది. pic.twitter.com/5nZSwDkjxo