సత్యసాయి: చిలమత్తూరు మండలం లాలేపల్లి నుంచి చిన్నన్నపల్లి గ్రామానికి రహదారి లేక గ్రామస్తులు ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు చిలమత్తూరు సీనియర్ నాయకుడు నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో లాలేపల్లి–చిన్నన్నపల్లి తారు రోడ్డు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రహదారి పనులు ప్రారంభం కావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.