KNR: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు అండగా నిలుస్తోందని నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ పేర్కొన్నారు. హుజురాబాద్ మండలం శాలపల్లి, కాట్రపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.