MDK:రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న 765 డీజీ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ఆదివారం ఎంపీ రఘునందన్ రావును కలిశారు. తమకు ముందు ఇచ్చిన హామీ మేరకు నష్టపరిహారం పెంచాలని, మార్కెట్ ధరతో సమానంగా ధర చెల్లించాలని వినతిపత్రం సమర్పించారు. విలువైన భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.