ADB: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో చర్చించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలను పంచాయతీ నిధుల ద్వారా చెల్లించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 2వ తేదీన ఇచ్చిన సర్క్యులర్‌ను రద్దు చేయాలన్నారు.