ELR: వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలకులుగా బి.వి.ఆర్ చౌదరి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలియజేశారు.