ప్రముఖ నటి ప్రణీత (Actress Praneetha) తన భర్తకు పాద పూజ చేస్తుండగా తీసిన ఫొటోను షేర్ చేసింది. ప్రతి ఏటా భీమన అమావాస్య నాడు ఆమె ఈ పూజ చేస్తుంటుంది. గతేడాది కూడా ఇలాగే ఫొటో షేర్ చేయగా నెటిజన్లు(Netizens) ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. ఈ మారూ నెట్టింట సుదీర్ఘంగా చర్చ కొనసాగుతోంది. అయితే, విమర్శలను లెక్కచేయని ప్రణీత తన ఆచారవ్యవహారాలను కొనసాగిస్తోంది.రెండు రోజుల క్రితం ప్రణీత ఈ పొటో షేర్ చేయగా ఇప్పటికీ ఈ అంశంపై నెట్టింట చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటివరకూ ఈ ఫొటోకు 1.9 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈసారి ప్రణీతకు అనేక మంది మద్దతుగా నిలిచారు. సంప్రదాయాలు పాటించేవారు రక్షణాత్మక ధోరణి విడనాడాలని కొందరు ఘాటుగా బదులిచ్చారు. ఎవరికీ సంజాయిషీలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.
ఈ మారు పాద పూజ ఫొటోతో పాటూ దాని గొప్పదనాన్ని వివరించింది ప్రణీత. ‘‘భీమన అమావాస్య(Bhimana Amavasya) సందర్భంగా ప్రతి ఏటా నేను నా భర్తకు పాదపూజ చేస్తుంటాను. గతేడాది ఈ విషయంలో నేను విమర్శలు ఎదుర్కొన్నారు. అలా ట్రోల్ చేసిన వారికి ఇది పితృస్వామ్యంలా కనిపిస్తోందేమో కానీ నాకు మాత్రం ఇది సనాతన ధర్మంలో ఓ భాగమే. దీనికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఇలాంటి మరెన్నో గొప్ప పూజలు మన ధర్మంలో ఉన్నాయి. వాటి ప్రాముఖ్యతను తెలుపుతూ ఎన్నో కథలు కూడా హిందూ పురాణాల్లో ఉన్నాయి. మన సంస్కృతిలో అందరి దేవతలను ఒకేలా పూజిస్తాం’’ అని చెప్పింది ప్రణీత(Praneetha).ఈ మారూ నెట్టింట సుదీర్ఘంగా చర్చ కొనసాగుతోంది. అయితే, విమర్శలను లెక్కచేయని ప్రణీత తన ఆచారవ్యవహారాలను కొనసాగిస్తోంది. సినిమా కెరీర్ పీక్స్‌లో ఉండగానే 2021లో వ్యాపారవేత్త నితిన్ రాజు(Nitin Raju)ను పెళ్లి చేసుకుంది. గతేడాది ఓ పాపకు కూడా జన్మనిచ్చింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తోన్న ప్రణీత సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటోంది. తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోలను తరచూ షేర్ చేస్తుంటుంది.