బీఆర్ఎస్ (BRS) పార్టీకి గద్వాల జిల్లాలో గట్టి షాక్ తగిలింది. జెడ్పీ చైర్పర్సన్ సరిత (Chairperson Sarita)పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అధిష్ఠానానికి ఫ్యాక్స్ ద్వారా పంపించినట్టు సరిత తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని వీడిన ఆమె కాంగ్రెస్ లో చేరనున్నారు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల సమక్షంలో హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. గద్వాల (Gadvala) అసెంబ్లీ నియోజకవర్గంలో కొన్నిరోజులుగా ఎమ్మెల్యేకు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితకు మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి.
ఈ కారణంగా సరిత అధికార పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao)… సరిత దంపతులతో చర్చలు జరిపి, కాంగ్రెస్ లోకి తీసుకువస్తున్నారు.ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రేపు కొల్లాపూర్ (Kolhapur) లో నిర్వహించాల్సిన సభలో ప్రియాంక గాంధీ పాల్గొనాల్సి ఉంది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సభను 30వ తేదీకి వాయిదా వేశారు. ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్(Congress)లో చేరతారని సమాచారం అందుతోంది.