తనకు అమ్మ సోనియా గాంధీ (Sonia Gandhi) అంటే ఎంత ప్రేమో.. పలు సందర్భాల్లో రాహుల్ గాంధీ తీసుకునే జాగ్రత్త చర్యలు ఇట్టే చెబుతుంటాయి.. అయితే, రాహుల్ గాంధీ తాజాగా, సోషల్ మీడియా(Social media)లో షేర్ చేసిన సోనియా గాంధీ ఫొటో ఇప్పుడు వైరల్గా మారిపోయింది.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన తల్లి సోనియా గాంధీకి సంబంధించిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో సోనియా తన ముఖానికి ఆక్సిజన్ మాస్క్ ధరించి ఉన్నారు. ఈ ఫోటోను రాహుల్ (Instagram) లో షేర్ చేశారు. ఆపదలోను దయకు అమ్మే ఉదాహరణ అంటూ క్యాప్షన్ పెట్టారు.
మంగళవారం సాయంత్రం రాహుల్, సోనియా ప్రయాణిస్తున్న బెంగళూరు(Bangalore)-ఢిల్లీ విమానం భోపాల్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విమానంలో ఆక్సిజన్ (Oxygen) తగ్గింది. ఆ సమయంలో ఈ ఫోటోను తీశారు. విపరీతమైన ఒత్తిడిలోను తన తల్లి ప్రశాంతంగా ఉందంటూ రాహుల్ ప్రశంసించారు.రాహుల్ చేసిన ఈ పోస్ట్ కు కొన్ని గంటల్లోనే లక్షల లైక్స్ వచ్చాయి. ఇదిలాఉండగా, భోపాల్ (Bhopal) విమానాశ్రయంలో రాహుల్, సోనియాలు ఉన్న విమానానిది ఎమర్జెన్సీ ల్యాండింగ్ కాదని, ప్రాధాన్యతా ల్యాండింగ్ అని భోపాల్ విమానాశ్రయ డైరెక్టర్ రాంజీ అవస్తీ వెల్లడించారు. కాగా, మంగళవారం దాదాపు గంటన్నర సేపు ఎయిర్ పోర్టులో ఉన్న రాహుల్, సోనియా రాత్రి గం.9.35కు ఢిల్లీకి వెళ్లారు.