Keerthy Suresh: కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ.. ఈసారి పక్కా?
చాలా కాలంగా మహానటి కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ గురించి చర్చ జరుగుతునే ఉంది. కానీ క్లారిటీ మాత్రం రావడం లేదు. అయితే.. ఈసారి మాత్రం అమ్మడు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం ఖాయమంటున్నారు. ఇప్పటికే ఓ ప్రాజెక్ట్‌కు పచ్చ జెండా ఊపేసినట్టు తెలుస్తోంది.
మహానటిగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్.. చివరగా దసరా సినిమాలో వెన్నెలగా అదరగొట్టేసింది. త్వరలోనే మెగాస్టార్ నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమాతో ఆడియెన్స్ ముందుకి రాబోతోంది. ఈ సినిమాలో చిరు చెల్లెలిగా నటించింది కీర్తి. ప్రస్తుతం తమిళ్, మళయాళ భాషల్లో కొన్ని సినిమాలు చేస్తోంది. ఇక ఇప్పుడు బాలీవుడ్లో ఎంట్రి ఇచ్చేందుకు రెడీ అవుతోంది. వాస్తవానికి కీర్తి పాప 2019లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల్సింది. అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కిన మైదాన్ సినిమాకు కీర్తి సురేష్‌ను హీరోయిన్గా అనుకున్నారు. కానీ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత ఆమెను తప్పించారు.
అప్పటి నుంచి కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ పోస్ట్‌పోన్ అవుతునే ఉంది. అయితే ఎట్టకేలకు ఫైనల్‌గా.. ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్‌కు అమ్మడు సై అనేసినట్టు తెలుస్తోంది. వరుణ్ ధావన్ హీరోగా తమిళ దర్శకుడు కాలీస్ తెరకెక్కించనున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్కు కీర్తి ఓకె చెప్పినట్టు తెలుస్తోంది. వచ్చే నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని టాక్. నవంబర్ వరకు షూటింగ్ కంప్లీట్ చేసి.. వచ్చే ఏడాది మే 31న ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి అఫిషీయల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు.
అయితే బాలీవుడ్ ప్రాజెక్ట్ అంటే, హీరోయిన్లకు గ్లామర్ షో తప్పదు. కాబట్టి కీర్తి నుంచి ఊహించని గ్లామర్ ట్రీట్ రాబోతోందనే చెప్పాలి. కీర్తి కూడా మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి మెల్లిగా గ్లామర్ డోస్ పెంచుతూ వస్తోంది. అప్పటి నుంచి మొదలైన అమ్మడి అందాల జాతర.. రోజు రోజుకి సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తునే ఉంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోతోంది కీర్తి. దాంతో ఇన్నాళ్లు హోమ్లీ ఫిగర్ అని మురిసిపోయిన కుర్రాళ్లు.. అమ్మడి అందానికి ఫిదా అయిపోతున్నారు.