Megastar Chiranjeevi: సరికొత్త పాత్రలో మెగాస్టార్.. పాస్ పోర్టు ఆఫీస్‌లో?
ప్రస్తుతం తమిళ్ హిట్ మూవీ 'వేదాళం' రీమేక్‌గా తెరకెక్కుతున్న 'భోళా శంకర్' అనే సినిమాలో నటిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈ సినిమా తర్వాత వరుస ప్రాజెక్ట్స్ సెట్ చేసే పనిలో ఉన్నారు చిరు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు టాలెంటెడ్ డైరెక్టర్స్ చిరు కోసం లైన్లో ఉన్నారు. అందులో కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్ట్ ఓకె అయిపోయింది. ఈ సినిమాలోనే మెగాస్టార్ డిఫరెంట్ రోల్ చేయనున్నట్టు తెలుస్తోంది.
మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్.. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. డబ్బింగ్ పనులు కూడా కంప్లీట్ చేశారు మెగాస్టార్. ఆగస్ట్ 11న భోళా శంకర్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తర్వలోనే ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడప్ చేయనున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా తర్వాత బంగార్రాజు ఫేం కళ్యాణ్ కృష్ణ కురసాలతో ఓ సినిమా చేయబోతున్నాడు మెగాస్టార్. ఈ సినిమాని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మించబోతున్నారు.
ఈ సినిమా ఒక్క ఫైట్ కానీ విలన్ గాని లేకుండా మెగాస్టార్ మార్క్ హిలేరియస్‌గా రాబోతోంది ఈ ప్రాజెక్ట్. ఆగష్టు 22న మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఈ ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. చెన్నై బ్యూటీ త్రిష ఈ సినిమాలో హీరోయిన్గా నటించే ఛాన్స్ ఉంది. యంగ్ బ్యూటీ శ్రీలీల కీ రోల్ ప్లే చేయనుందని సమాచారం. ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. మెగాస్టార్ ఈ సినిమాలో ఇప్పటి వరకు చేయని పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాలో చిరంజీవి ‘పాస్ పోర్టు ఆఫీసర్’ గా కనిపించనున్నారని తెలుస్తోంది.
ఇలాంటి పాత్రలో ఇప్పటి వరకు కనిపించలేదు చిరు. అంతేకాదు ఈ రోల్లో చిరు లుక్ చాలా స్టైలీష్‌గా ఉండనుందని అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాకు ప్లాన్ చేస్తున్నారు మెగాస్టార్. అలాగే బింబిసారతో సాలిడ్ హిట్ అందుకున్న మల్లిడి వశిష్టతోను ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. అనిల్ రావిపూడితో అదిరిపోయే కామెడీ ఎంటర్టైనర్.. మల్లిడి వశిష్ఠతో సోషియో ఫాంటసీ చేయబోతున్నట్టు టాక్.