KKD: పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DEO రమేశ్ శనివారం తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సందేహాల నివృత్తికి DEO కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే 9666714898 నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. కాగా ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 10వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి.