NDL: కొత్తపల్లె మండలం ముసలిమడుగులో మునగ పంటకు వేరు కుళ్లు తెగులు రావడంతో రైతు బాబు రెడ్డి తీవ్రంగా నష్టపోయినట్లు శనివారం తెలిపాడు. రూ.70 వేల పెట్టుబడితో రెండెకరాల్లో సాగు చేసిన పంటకు సాధారణంగా వచ్చే దిగుబడి రాక ఈసారి కేవలం 1.2 క్వింటాళ్లు మాత్రమే వచ్చిందని రైతు వాపోయాడు. పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.