కృష్ణా: రోడ్డు ప్రమాదాలను నివారించడం, అక్రమ రవాణాను అడ్డుకోవడం అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడం కోసం గుడివాడలో ట్రాఫిక్ ఎస్సై నాగరాజు శనివారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, RC, పొల్యూషన్ ఇన్షూరెన్స్ వంటి కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై చలాన్లు విధించారు.