ఖమ్మం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ కొణిజర్ల మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు అంజనాపురం గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలిస్తారని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్ తెలిపారు. ఫ్యాక్టరీ నిర్మాణ పురోగతిని సమీక్షించి, పనులను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తారన్నారు.