»Court Notices To Brs In Kokapet Land Allotment Dispute
BRS: కోకాపేట భూకెటాయింపుల వివాదంలో బీఆర్ఎస్ కు కోర్టు నోటీసులు
కోకాపేటలో ఎకరం రూ. 50 కోట్లు విలువ చేసే భూమిని బీఆర్ఎస్ కు కేవలం రూ. 3.41 కోట్లకే కేటాయించిన విషయంలో ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరిగింది.
Court notices to BRS in Kokapet land allotment dispute
హైదరాబాద్(Hyderabad) లోని అత్యంత ఖరీదైన ఏరియా కోకాపేట(Kokapet)లో అధికార భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)కి పదకొండు ఎకరాల భూమిని కేటాయించడంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. విచారణ అనంతరం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్(BRS)కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు నేడు విచారించింది. ఎకరం రూ. 50 కోట్లు పలుకుతున్న భూమిని కేవలం రూ. 3.41 కోట్లకే బీఆర్ఎస్ కు కేటాయించినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా భూకేటాయింపునకు సంబంధించిన పత్రాలన్నింటినీ రహస్యంగా ఉంచినట్లు తెలిపారు. దీనిని విచారించిన న్యాయస్థానం నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను ఆగస్ట్ 16వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్రప్రభుత్వం శిక్షణ, ఎక్సలెన్స్ పేరిట 11 ఎకరాల భూమిని అతి తక్కవ ధరకే బీఆర్ఎస్ పార్టీకి కేటాయించడంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ జులై 10న హైకోర్టులో పిల్ వేయగా దానిపై నేడు విచారణ జరిగింది.