»Congress Is Not Interested In The Post Of Prime Minister Mallikharjun Kharge
Mallikharjun Kharge: ప్రధాని పదవిపై కాంగ్రెస్ కు ఆసక్తి లేదు.. మల్లిఖార్జున్ ఖర్గే
కాంగ్రెస్ పార్టీకి ప్రధాన మంత్రి పదవిపై ఆసక్తి లేదని ప్రజా ప్రయోజానల కోసమే పోరాడుతుంది అని బెంగళూరు ప్రతిపక్షసమావేశంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.
Congress is not interested in the post of Prime Minister.. Mallikharjun Kharge
బెంగళూరు(Bengaluru)లో ఉమ్మడి ప్రతిపక్ష నేతల సమావేశంలో కాంగ్రెస్(Congress) జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని పదవిపై ఆసక్తి లేదని చెప్పారు. కాంగ్రెస్కు అధికారంపైనా, ప్రధాన మంత్రి పదవిపైనా ఆసక్తి లేదు. ఈ సమావేశం ఉద్దేశం.. అధికారం దక్కించుకోవడం కాదు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవడం అని వెల్లడించారు.
కర్ణాటకలోని బెంగళూరులో 26 ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతల సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం అధికార పక్షాన్ని ఓడించడానికి పలు వ్యూహాలపై మాట్లాడిన వీరు మంగళవారం లు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఖర్గేమాట్లాడుతూ.. మన 26 పార్టీలు, 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని, బీజేపీకి సొంతంగా 303 సీట్లు రాలేదు.. మిత్రపక్షాల ఓట్లను ఉపయోగించుకొని ఆ తర్వాత ఆయా పార్టీలను విస్మరించింది అని ఆరోపించారు. తమ మధ్య కొన్ని విభేదాలున్నా అవి సిద్ధాంతపరమైనవి కాదని విపక్ష భేటీలో ఖర్గే పేర్కొన్నారు. చిన్నపాటి విభేదాలను పక్కన పెట్టి ప్రజా ప్రయోజనాల కోసం పోరాడగలమని వ్యాఖ్యానించారు.
మోడీ ప్రభుత్వం సామాన్యులు, మధ్యతరగతి, యువత, పేదలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీల హక్కులను హిరిస్తుందని మన పోరాటం దీనిపై పటిష్టంగా జరగాలని వెల్లడించారు. బీజేపీ నేతలు సీబీఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి సంస్థలను వారి స్వార్థలకు ఉపయోగిస్తూ.. కాంగ్రెస్ నేతలను బెదిరింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూపీఏ పేరు మార్పు కోసం నాలుగైదు పేర్లను పరిశీలిస్తున్నారు. నేడు నూతన కూటమి పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఈ కూటమికి చైర్ పర్సన్ గా సోనియా గాంధీని నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.