టీమిండియా మాజీ సారథి కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని(Mahendra Singh Dhoni)కి కార్లు, బైక్ లంటే చాలా ఇష్టం.. ఎంతగా అంటే నచ్చిన బైక్ ను వెంటనే కొనేసి ఇంట్లో పెట్టుకునేంత.. ఇలా కొన్న బైక్ లు కార్ల కోసం ధోనీ ఏకంగా ఓ గ్యారేజ్ కట్టించుకున్నారు. అందులో ఎన్ని బైక్ లు ఉన్నాయో లెక్కేలేదట. ఈ గ్యారేజ్ లో ఉన్నన్ని బైక్ లు షోరూమ్ లో కూడా ఉండవట. తాజాగా మాజీ క్రికెటర్లు వెంకటేశ్ ప్రసాద్, సునీల్ జోషీ (Sunil Joshi) ఈ గ్యారేజ్ ను సందర్శించిన వీడియో బయటకు వచ్చింది.
ధోని గ్యారేజ్ ను వీడియో తీసి వెంకటేశ్ ప్రసాద్ (Venkatesh Prasad) సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోలో గ్యారేజ్ లో ధోని సేకరించిన కొత్త, పాత బైక్ లు, రకరకాల మోడల్ కార్లను చూడొచ్చుకొన్ని కార్లను ధోని విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్నారని, ఇంకొన్నింటిని భారత ఆర్మీ (Indian Army) నుంచి కొనుగోలు చేశారని తెలుస్తోంది. బైక్ లను సేకరించడం మాత్రమే కాదు.. వాటికి తరచుగా సర్వీసింగ్ కూడా స్వయంగా ధోనీయే చేస్తారు. దీనికి సంబంధించిన ఫొటోలను ధోనీ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో తన అభిమానుల కోసం పోస్టు చేస్తుంటారు.1990ల నాటి ఈ ఇద్దరు ఆటగాళ్లు రాంచీ పర్యటన సందర్భంగా ధోనీ ఫామ్‌హౌస్‌కి చేరుకున్నారు. ధోనీ తన నిజమైన నిధిని అంటే గ్యారేజీని ఇందులో చూపించాడు. అది చూడగానే కళ్లు బైర్లు కమ్ముతాయంతే.
One of the craziest passion i have seen in a person. What a collection and what a man MSD is . A great achiever and a even more incredible person. This is a glimpse of his collection of bikes and cars in his Ranchi house. Just blown away by the man and his passion @msdhonipic.twitter.com/avtYwVNNOz