ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో మాగుంట రాఘవ(Magunta Raghava)కు బెయిల్ మంజూరైంది. అనారోగ్యం కారణాలతో ఢీల్లీ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన నాలుగు వారాల బెయిల్ ఇచ్చింది.లిక్కర్ స్కాం(Liquor scam)లో కొన్ని నెలల కిందట ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కొడుకు రాఘవను సీబీఐ (CBI) అరెస్ట్ చేసింది. తాజాగా రాఘవకు బెయిల్ మంజురు కాగా గతంలో రాఘవ బెయిల్ పిటిషన్ అభ్యంతరం వ్యక్తం చేసిన ఈడీ, సీబీఐ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.కేసు విచారణలో అధికారులకు సహకరించాలని, ఎప్పుడు పిలిచినా హాజరవ్వాలని హైకోర్టు (High Court) తెలిపింది. చెన్నై సిటీకే పరిమితం కావాలని, పాస్ పోర్ట్ ను కోర్టుకు సరెండర్ చేయాలని, దేశం దాటి వెళ్లొద్దని ఆదేశించింది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో సాయంత్రం 4 గంటలకు ఈడీ ఎదుట రిపోర్టు చేయాలని పేర్కొంది.