దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RamGopalVarma) ఛాన్స్ దొరికితే పవన్ కళ్యాణ్ ని ఆడేసుకుంటాడు. ఆయనపై సెటైర్స్ వేస్తుంటారు. సీఐ అంజూ యాదవ్ పై పవన్ తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి(SPParameshwarReddy)కి ఫిర్యాదు చేశారు. కాగా దీనిపై డైరెక్టర్ ఆర్జీవీ స్పందించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తిరుపతి ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన వీడియోను తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. చంపేస్తా, నరికేస్తా, చర్మం వలిచేస్తా అంటూ సింహంలా గాండ్రించే పవన్ కల్యాణ్.. ఎస్పీ ముందు చేతులు కట్టుకొని ఎస్పీగారూ అంటూ మాట్లాడారని ఆయన వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే పవన్ కల్యాణ్ హీరో నుంచి జీరో అయినట్టుందని, ఈ ఘటనతో పవన్ అభిమానిగా తాను చాలా హర్ట్ అయ్యానని సెటైర్లు (satyrs)వేశారు.హేయ్ @PawanKalyan , చంపేస్తా, నరికేస్తా, చర్మం వలిచేస్తా , అని సింహం లా గాండ్రించిన తర్వాత ఇలా దీనంగా చేతులు కట్టుకుని S P గారు అంటూ మాట్లాడటం హీరో నుంచి జీరో అయినట్టుంది.. యాజ్ ఏ ఫ్యాన్ , ఐ హర్టెడ్ ట్విట్టర్ లో పెర్కోన్నారు