హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని ముసురు కమ్మేసింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. దీంతో.. ఉదయం రోడ్లపైకి వచ్చిన నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలపై వెళ్లే వారు నెమ్మదిగా, జాగ్రత్తగా డ్రైవ్ చేయడం బెటర్. అటు నగర శివారు ప్రాంతాల్లోనూ చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Department of Meteorology) ఇప్పటికే హెచ్చరించింది. ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. గురు, శుక్రవారాల్లోనూ భారీగా కొనసాగనున్నాయని పెర్కోన్నాది. బుధవారంలోగా బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంపై గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని అంచనా.
మరోవైపు ఝార్ఖండ్ (Jharkhand) దక్షిణ ప్రాంతంపై 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు మరో ఉపరితల ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున భారీవర్షాలు (heavy rains) కురిసే సూచనలున్నాయి. సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అక్కడక్కడ స్వల్పంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా మెండోరా(నిజామాబాద్ జిల్లా)లో 1.9, భైంసా(నిర్మల్)లో 1.2, గోధూరు(జగిత్యాల)లో 1.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, ఫలితంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.