తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (T.F.J.) సభ్యులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను నటి రష్మిక మందన్నా ప్రధానం చేశారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ (Prasad Labs) లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రతి ఒక్కరికీ కార్డులు అందజేశారు.గౌరవ అతిథులుగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేనిగారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ గారు, షైన్ స్క్రీన్స్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి గారితో పాటు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్.పి, ఏసియన్ సినిమాస్ సిఎమ్ఓ జాన్వీ నారంగ్ గారు హాజరయ్యారు. ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టిఎఫ్జేఏ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. మేం చేస్తోన్న ఈ కార్యక్రమాలూ, ఇన్సూరెన్స్ గురించి తెలిసి చిరంజీవి(Chiranjeevi)అడగకుండానే మాకు సాయం చేశారన్నారు.
కరోనా టైమ్ లో ఎవరూ ఎవరికీ సాయం చేసుకోలేని పరిస్థితిలు వచ్చినప్పుడు ఎక్కువ ఇబ్బంది పడుతున్న వారికి ఒక 60మందికి మొదటి సారి నెలవారీ సరుకులు అందచేశాం. ఒక్కోసారి మా యూనియన్( MA union) లో లేకపోయినా సాయం చేశాం. ఒక మిత్రుడినికి వాళ్ల అమ్మగారు చనిపోతే.. ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా సాయం చేశాం. ఇలా చాలామందికి మా సంఘం ద్వారా సాయం చేశామని ఆయన తెలిపారు. వీటితో పాటు భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలు చేయబోతున్నాం. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. ఇక ఈ యేడాదికి సంబంధించి విశ్వ ప్రసాద్ ని ఇన్సూరెన్స్ గురించి చెప్పగానే.. వెంటనే స్పందించారు.
ప్రస్తుతం ఇన్సూరెన్స్ గురించి ఏ ప్రొడ్యూసర్ (Producer) దగ్గరికి వెళ్లినా.. వాళ్లే మమ్మల్ని అడుగుతున్నారు. ఈ యేడాదికి ఎంత అవుతుంది.. అని. ఆ స్థితికి మన సంఘం చేరుకుందన్నారు. ఒక యూనియన్ అందరి క్షేమం కోసం ఆలోచించడం చూస్తే సంతోషంగా ఉందని రష్మిక మందన్నా అన్నారు . మామూలుగా మా సినిమాలకు సంబంధించిన ఏ ఫంక్షన్ జరిగినా మీరంతా వచ్చి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు పిలవగానే నేను రావడం హ్యాపీగా ఉంది. మీరంతా బావుండాలి. ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్యూ. మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది. ఇకపై కలుస్తూనే ఉంటా.. ” అన్నారు.