క్యాసినో చికోటి ప్రవీణ్ (Chikoti Praveen)సెక్యూరిటీ సిబ్బందిపై కేసు నమోదు అయింది. ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాల్ దర్వాజా సింహవాహిణి అమ్మవారి ఆలయం వద్దకు అనుమతి లేకుండా ఆయుధాలు కలిగిన ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని వెంట తీసుకెళ్లినందుకు చత్రినాక పోలీస్ స్టేషన్(Chatrinaka Police Station)లో కేసు నమోదైంది. చీకోటి సహా ముగ్గురిపై పోలీసులు చీటింగ్‌తోపాటు ఫోర్జరీ, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. A1గా చికోటి, A2గా రాకేష్, A3గా సుందర్ నాయక్, A4గా రమేష్ గౌడ్లుగా చేర్చారు. వెపన్స్ లైసెన్స్ (Weapons License)ఫేక్ డాక్యుమెంట్లుగా పోలీసులు తేల్చారు. కాగా, వెపన్స్ లైసెన్స్ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఏడాది క్రితం ఛత్రినాక పోలీస్ స్టేషన్ కు పంపామని చికోటి ప్రవీణ్ అంటున్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపు అంటున్నారు.
గజ్వేల్ ఘటన తర్వాత తనను టార్గెట్ చేశారని చికోటి ప్రవీణ్ తెలిపారు. మతం కోసం, హిందుత్వం కోసం తాను పోరాటం చేస్తానని అన్నారు.ఈ మేరకు సోమవారం చీకోటి ప్రవీణ్ మాట్లాడారు. తనకు ప్రాణ హాని ఉందని ప్రైవేట్ భద్రత (Private security) ఏర్పాటు చేసుకున్నానని తెలిపారు. గన్స్ కు లైసెన్స్ (GunLicense) ఉందని తమకు డాక్యుమెంట్స్ చూయించారని వెల్లడించారు. డాక్యుమెంట్స్ మొత్తం పరిశీలించాలని సైదాబాద్ (Saidabad) పోలీస్ స్టేషన్ కు పంపించానని చెప్పారు. వారు డాక్యుమెంట్స్ చూసి ఎలాంటి నివేదిక ఇవ్వలేదని పేర్కొన్నారు.ఇప్పుడు డాక్యుమెట్స్ ఫోర్జరీ అని కేసు నమోదు చేశారని తెలిపారు.
ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని సైదాబాద్ పోలీసులు ముందే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఇందుకు పోలీసుల తప్పిదమే కారణమని చెప్పారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్(Forgery documents) ఉంటే చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో పార్టీ జాయిన్ గురించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. రాజకీయంగా తనను ఎదుర్కొనలేక తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.జన సమూహంలోకి ప్రైవేటు సిబ్బందితో రావడం చట్టరీత్యా నేరం కావడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.
చదవండి :రీసెంట్ హిట్ డైరెక్టర్‌తో నాగ చైతన్య.. టార్గెట్ విడాకులు?