Chikoti Praveen:చికోటి ప్రవీణ్ కుమార్ (Chikoti Praveen), నసీర్ ఖాన్‌కు (naseer khan) ఈడీ తాజాగా నోటీసులు జారీచేసింది. లగ్జరీ కార్లు కొని పన్ను ఎగవేశారని పేర్కొంది. వీరితోపాటు ట్యాక్స్ కట్టని వారికి నోటీసులు అందజేసింది. బినామీ ఆస్తుల లావాదేవీ చట్టం కింద కేసు నమోదు చేసింది.
చికోటి ప్రవీణ్, నసీర్ (naseer) తదితరులు బినామీల పేర్లతో కార్లను కొనుగోలు చేశారు. కార్లలో రయ్ మని తిరుగుతున్నారు కానీ.. పన్ను ఎగవేశారు. అలాంటివారిని ఈడీ గుర్తించి.. నోటీసులు జారీచేసింది. ప్రవీణ్, నసీర్, మోసిన్ తదితరులకు ఈడీ నోటీసులు ఇచ్చింది.
చికోటి ప్రవీణ్ వద్ద లగ్జరీ రేంజ్ రొవర్ కారు ఉన్న సంగతి తెలిసిందే. ఇక నసీర్ (naseer) వద్ద రూ.12 కోట్ల గల మేక్ లారెన్ 765 ఎల్ టీ స్పైడర్ కారు ఉంది. నసీర్ (naseer) తండ్రి షానవాజ్ కాగా.. అతనికి కింగ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఉన్నాయి. నసీర్ ఖాన్ (naseer) సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్, వ్యాపారవేత్త అని తెలిసింది. ఇన్ స్టలో ఇతనికి 3.5 లక్షల ఫాలోవర్లు ఉన్నారు.
మెక్ లారెన్ కంపెనీ ఇండియా మార్కెట్లో లాస్ట్ ఇయర్ ఎంట్రీ ఇచ్చింది. గత ఏడాది బెంగాల్‌కు చెందిన వ్యాపార వేత్త ప్రవీణ్ అగర్వాల్ 720 ఎస్ స్పైడర్ మోడల్ కారు కొనుగోలు చేశారు. 765 ఎల్టీ స్పైడర్ కారు కొనుగోలు చేసిన తొలి భారతీయ వ్యక్తి నసీర్ ఖాన్ కావడం విశేషం.
మేక్ లారెన్ 765 ఎల్టీ స్పైడర్ ఎలక్ట్రిక్ కారు టాప్ ఓపెన్ కావడానికి 11 సెకన్ల సమయం పడుతుంది. కార్బన్ ఫైబర్‌లో బాడీ తయారు చేశారు. నసీర్‌కు 20కి పైగా హై ఎండ్ కార్లు ఉన్నాయి. రోల్స్ రాయిస్ కలినన్ బ్లాక్ బ్యాడ్జ్, ఫెరారీ 812 సూపర్ ఫాస్ట్, మెర్సిడెజ్ బెంజ్ జీ 350 డీ, ఫోర్డ్ ముస్టాంగ్, లంబోర్గిని అవేంటడార్, లంబోర్గిని ఉరుస్ కార్లు ఉన్నాయి.