శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ట్విట్టర్‌కు కొత్త CEOని తీసుకోవాలని యోచిస్తున్నట్లు మస్క్(Elon Musk) పేర్కొన్నారు. మరో 6 వారాల్లో ఆమె పదవిలోకి రాబోతుందని వెల్లడించారు.
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్(twitter)కు కొత్త సీఈవో రానున్నారు. ఈ సంస్థను కొనుగోలు చేసినప్పటి నుంచి సీఈవోగా వ్యవహరిస్తున్న ఎలాన్ మస్క్(Elon Musk) తన పదవి నుంచి తప్పుకోనున్నారు. తన స్థానంలో నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను ఎంపిక చేసినట్లు మస్క్ ట్వీట్ చేశారు. ఇకపై తాను కంపెనీ చీఫ్ టెక్నాలజిస్ట్ గా కొనసాగనున్నట్లు చెప్పారు.
అయితే ట్విట్టర్ బాస్ గా ఎవరిని ఎంపికచేసినట్లు మాత్రం మస్క్ వెల్లడించలేదు. కానీ ఆరు వారాల్లో ఆమె కొత్త సీఈవో బాధ్యతలు చేపట్టనున్నారని తెలిపారు. ఆయన ట్వీట్ ప్రకారం ట్విట్టర్ కు మహిళా సీఈవో రానున్నారని తెలుస్తోంది. అయితే, ట్విట్టర్ నూతన సీఈఓగా ఎన్బీసీ యూనివర్సల్ మీడియాలో గ్లోబల్ అడ్వర్టైసింగ్ అండ్ పార్ట్ నర్షిప్స్ విభాగం చైర్మన్ గా పనిచేస్తున్న లిండా యాకారినో ను మస్క్ ఎంపికచేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.
Excited to announce that I’ve hired a new CEO for X/Twitter. She will be starting in ~6 weeks!
My role will transition to being exec chair & CTO, overseeing product, software & sysops.
డిసెంబర్లో తన అనుచరుల పోల్‌ను అమలు చేసిన తర్వాత మస్క్ ట్విట్టర్‌కు పగ్గాలను అప్పగించడానికి కట్టుబడి ఉన్నాడు. దాదాపు 60% మంది అతని పదవీవిరమణకు అనుకూలంగా ఓటు వేశారు. దీంతోపాటు అతను ట్విట్టర్ నిర్వహణలో భాగంగా టెస్లాపై ఆందోళనతో ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో అతను తన ఉద్యోగాన్ని మరోక వ్యక్తికి అప్పగిస్తానని వెల్లడించారు.