Princess Diana’s necklace worn to final royal duty is now on sale for £10 million
Princess Diana:యువరాణి డయానాను (Princess Diana) ఎవరు మర్చిపోలేరు. ఆమె అందం, మాటతీరు, హావభావాలు, ధరించే దుస్తులు ఇలా ఆమెజీవితంలోని ప్రతి అంశం ప్రజలకు నచ్చింది. 36 సంవత్సరాల వయస్సులో, యువరాణి డయానా కారు ప్రమాదంలో మరణించింది. నేటికీ ఆమె మరణంపై అనేక ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఆభరణాలను వేలం వేయనున్నారు.
డయానా (Princess Diana) చివరిసారిగా ధరించిన నక్లెస్ ని వేలానికి పెట్టారు. ఈ నెక్లెస్ ప్రిన్సెస్ డయానా కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. యువరాణి డయానా స్వాన్ లేక్ నెక్లెస్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆభరణాలలో ఒకటి. 1997లో చనిపోవడానికి కొన్ని రోజుల ముందు లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రిన్సెస్ డయానా ఈ నెక్లెస్‌ను ధరించారు. బ్రిటిష్ మీడియా ప్రకారం, ఈ నెక్లెస్ 178 వజ్రాలు, ఐదు ముత్యాలతో తయారు చేశారు. అప్పటి క్రౌన్ జ్యువెలర్ గారర్డ్ ఈ విలువైన హారాన్ని తయారు చేసినట్లు తెలిసింది.
ఈ నెక్లెస్ 10 మిలియన్ పౌండ్లకు అమ్ముతున్నట్లు టాక్. వచ్చే నెల (జూన్)లో వేలం నిర్వహించనున్నారు.ఈ నెక్ లెస్ కి 10 మిలియన్లు (రూ. 1,03,33,40,118.00) లభిస్తుందని నమ్ముతారు. డయానా ప్రైవేట్ ఆభరణాలను బహిరంగంగా విక్రయించడం ఇదే తొలిసారి. న్యూయార్క్‌లో వేలం వేయడానికి ముందు వాటిని లండన్‌లో ప్రదర్శనకు ఉంచనున్నారు. న్యూయార్క్‌లోని గ్వెర్న్సీ వేలంపాట జరుగుతుంది.
డయానా కోసం తయారు చేసిన స్వాన్ లేక్ నెక్లెస్‌కు సరిపోయేలా చెవిపోగులు తయారు చేశారట. ఆమె అకాల మరణం అందరినీ విస్మయానికి గురిచేసింది. అందువల్ల డయానా మరణం తర్వాత, ఆమె కుటుంబం నెక్లెస్ , దానికి సరిపోలే చెవిపోగులు విక్రయించడానికి అనుమతించింది. వచ్చిన మొత్తంలో కొంత యూనిసెఫ్‌కు వెళ్లనుంది.
డయానా నెక్లెస్‌ను అమెరికన్ వ్యాపారవేత్త జిమ్ మెక్‌కింగ్‌వాల్ 1999లో కేవలం 1 మిలియన్‌కు కొనుగోలు చేశారు. అతను దానిని 2008లో ఆర్థిక మాంద్యం సమయంలో రాజకుటుంబానికి పెద్ద అభిమానులైన ఉక్రేనియన్ కుటుంబానికి విక్రయించాడు. ఇప్పుడు కుటుంబం ఉక్రెయిన్ పునర్నిర్మాణం కోసం ఈ నెక్లెస్‌ను విక్రయించాలని నిర్ణయించుకుంది.